NEWSTELANGANA

గెలుపు ఖాయం అభివృద్ది త‌థ్యం

Share it with your family & friends

ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కామెంట్

వ‌న‌ప‌ర్తి జిల్లా – సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ ఎంపీ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పార్ల‌మెంట్ ప‌రిధిలోని వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించారు.

నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గోపాల్ పేట‌, పెద్ద‌మంద‌డి మండ‌లాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు..జ‌నంతో మ‌మేకం అయ్యే ప్ర‌య‌త్నం చేశారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న వెంట మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి కూడా ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. తాను నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీగా గెలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వ‌చ్చాక అభివృద్దిలో జిల్లాను టాప్ లో నిలిపేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. మీ అంద‌రి ప‌క్షాన పార్ల‌మెంట్ లో త‌న వంతుగా వినిపిస్తాన‌ని ప్ర‌కటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

త‌మ భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు.