ముంబై : టాటా సన్స్‌ను తక్షణమే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న జరగనున్న టాటా సన్స్ బోర్డు సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. గణేష్ చతుర్థి కారణంగా సోమవారం మార్కెట్ మూసి ఉన్నప్పటికీ, టాటా సన్స్ లిస్టింగ్ అవకాశాల దృష్ట్యా మంగళవారం నాడు ఈ టాటా గ్రూప్ కంపెనీలు అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి. నాన్-బ్యాంక్ రుణదాతగా తమ నమోదును రద్దు చేసుకోవాలన్న టాటా సన్స్ అభ్యర్థనను ఆర్బీఐ తిరస్కరించడం , తక్షణమే లిస్ట్ చేయాలని ఆదేశించడం వల్ల కొన్ని టాటా గ్రూప్ కంపెనీలకు, అలాగే టాటా గ్రూప్ యేతర అతిపెద్ద వాటాదారు అయిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూరనుంది. లిస్టింగ్ ప్రక్రియ ద్వారా వీటి వాటాల విలువ వెలుగులోకి రానుంది. ఇదిలా ఉండగా, టాటా సన్స్‌ను తక్షణమే లిస్ట్ చేయాలని ఆర్బీఐ కోరడంతో సెప్టెంబర్ 17న జరగనున్న టాటా సన్స్ బోర్డు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏడాదిలో మరో 70 వరకు చేరనున్నాయి. ఏడు లిస్టెడ్ టాటా గ్రూప్ కంపెనీలు కలిసి టాటా సన్స్‌లో సుమారు 11.6 శాతం నుండి 13 శాతం వరకు వాటాను కలిగి ఉన్నాయి . టాటా మోటార్స్ (3.06 శాతం), టాటా స్టీల్ (3.06 శాతం), టాటా కెమికల్స్ (2.53 శాతం), టాటా పవర్ (1.65 శాతం), ఇండియన్ హోటల్స్ కంపెనీ (IHCL) (1.11 శాతం), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (0.43 శాతం) , టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (0.43 శాతం). షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, మిస్త్రీ కుటుంబానికి చెందిన ‘సైరస్ ఇన్వెస్ట్మెంట్స్’ ‘స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్’ (ఒక్కొక్కటి సుమారు 9.19 శాతం వాటా) అనే సంస్థల ద్వారా టాటా సన్స్‌లో 18.37 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వాటాలను ప్రధానంగా 1930లలో షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ స్వాధీనం చేసుకున్నారు. టాటా సన్స్ లిస్టింగ్ జరగడం వల్ల, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తమ వాటాలను సెకండరీ మార్కెట్లో లేదా లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ‘ఆఫర్ ఫర్ సేల్’ (OFS) ద్వారా విక్రయించి నగదుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది.







