విల‌న్ గా మోహ‌న్ బాబు చేస్తాడ‌ని అనుకోలేదు

హైద‌రాబాద్ : శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ది ప్యార‌డైజ్. ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు నేచుర‌ల్ స్టార్ నాని, ల‌వ్లీ బ్యూటీ కీర్తి సురేష్, విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్ బాబు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు నాని. శ్రీకాంత్ వచ్చి ది ప్యార‌డైజ్ కథను నాకు వినిపించాడు. అందులో విలన్ పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందని చెప్పాడు.. అంతటి సీనియర్ నటుడు అటువంటి క్రూరమైన పాత్రను చేయడానికి అంగీకరిస్తారా లేదా అని నాకు సందేహం కలిగింది. కానీ శ్రీకాంత్ వెళ్లి ఆయనకు కథ చెప్పినప్పుడు, ఆయన చూపించిన ఉత్సాహం చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను అని అన్నాడు నేచుర‌ల్ స్టార్ నాని.

గాలిలో దూసుకెళ్లే తుపాకీ కాల్పులు, గాలిలో గిరగిరా తిరిగే రోప్ యాక్షన్ సన్నివేశాలు… ఇవన్నీ శ్రీకాంత్ ఊహ నుండే పుట్టుకొచ్చాయని చెప్పాడు. షూటింగ్ సమయంలో ‘ప్యారడైజ్’ మూడ్‌లోకి వెళ్ళాక, అసలు నేను ఈ పాత్రను సరిగ్గా చేయగలనా అనే ఆలోచన కూడా నాకు రాలేదన్నాడు. ఆ పాత్రలో నేను అంతగా లీనమై పోయాన‌ని తెలిపాడు. నా కెరీర్ సెప్టెంబర్ నెలలోనే మొదలైంది . ‘భలే భలే మగాడివోయ్’ కూడా సెప్టెంబర్‌లోనే విడుదలైంది. ఇప్పుడు ది ప్యార‌డైజ్ మూవీ కూడా సెప్టెంబర్‌లోనే వస్తోందని చెప్పాడు. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా కలిసివచ్చి, ఇది అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నానని చ‌చెప్పాడు నాని.

తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులు నన్ను ఎంతగా ఆదరిస్తున్నారో చూడటం చాలా అద్భుతంగా అనిపించింద‌ని తెలిపాడు. అందుకే అక్కడ కూడా లిప్-సింక్ లేదా వాయిస్ క్వాలిటీ విషయంలో నేను ఏమాత్రం రాజీ పడలేద‌న్నాడు.

  • Related Posts

    త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ ను ప్ర‌శంసించిన అట్లీ

    చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ప్రశంసించాడు డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్. ఆయ‌న విజయ్ సేతుపతిపై పరోక్ష విమర్శలు చేశాడు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘బత్తా’ (Baththa) చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అట్లీ మాట్లాడారు.…

    విజయ్ రాఘవేంద్ర హీరోగా సంజీవ్ మేగోటి మూవీ

    హైదరాబాద్: క్రైమ్, యాక్షన్, థ్రిల్‌తో కూడిన విభిన్న కథలను తెరపై ఆవిష్కరించడంలో తనదైన ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *