అరుదైన ఘనతను సాధించిన యంగ్ డైనమిక్ యాక్టర్
చెన్నై : ప్రముఖ యంగ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ సంచలనం సృష్టించాడు. తను నటించిన తొలి మూడు సినిమాలు వరుసగా రూ. 100 కోట్ల చొప్పున వసూలు చేశాయి. ఈ ఘనతను సాధించి బ్రేక్ చేశాడు . తనకు ఎవరూ ఛాన్స్ లు ఇవ్వలేదు. కానీ తనకు సినిమాలంటే పిచ్చి ప్రేమ. మొదటగా లఘు చిత్రం తీశాడు. ఆ తర్వాత లవ్ టుడే తీశాడు. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ నటుడే కాదు దర్శకుడు, కవి, రచయిత, మాటలు, పాటల రచయిత కూడా. అన్ని రంగాలలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు. ఎంటర్ ది డ్రాగన్ తన రెండో మూవీ. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మూడో మూవీ తాజాగా విడుదలైన డ్యూడ్. ఇందులో మమతా బైజు నటించింది. దీనిని టాలీవుడ్ కు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
ఇందులో కీ రోల్ పోషించాడు ప్రదీప్ రంగనాథన్. తొలిసారిగా దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు కార్తీశ్వరన్ కు. తను సత్తా చాటాడు. ప్రదీప్, మమతాతో కలిపి మరో బంపర్ హిట్ కొట్టాడు. దీంతో ప్రదీప్ రంగనాథన్ వరుసగా తాను నటించిన లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో వరుసగా రూ. 100 కోట్ల చొప్పున వసూలు చేయడంతో రికార్డ్ నమోదు చేశాడు. ఇదిలా ఉండగా తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండానే స్వంతంగా పైకి వచ్చాడు తను. ఇప్పుడు రజనీకాంత్ , ధనుష్ తర్వాత అత్యంత జనాదరణ పొందిన యువ నటుడిగా పేరు పొందాడు ప్రదీప్ రంగనాథన్. ఈ అద్భుతమైన హ్యాట్రిక్ అతన్ని ప్రముఖ కొత్త తరం స్టార్‌గా నిలబెట్టింది, భావోద్వేగం, వినోదం, యువత ఆకర్షణను మిళితం చేసే కథలకు ప్రసిద్ధి చెందాడు. డ్యూడ్ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లు క్రాస్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని కోట్లను వసూలు చేయనుందని సినీ వర్గాల బోగట్టా.








