హాలీవుడ్ ను త‌ల‌ద‌న్నేలా హైద‌రాబాద్ ను చేస్తాం

ప్ర‌క‌టించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పెంచిన రేట్ల ధ‌ర‌ల్లో 20 శాతం సినీ కార్మికుల‌కు ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక‌పోతే జీవోలు జారీ చేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కార్మికుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అన్నారు. యూసుఫ్ గూడ‌లో సీఎంను స‌న్మానించారు సినీ కార్మికులు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. హైదరాబాద్‌ను హాలీవుడ్‌తో సమానంగా ప్రపంచ స్థాయి చలనచిత్ర కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ రంగాల‌తో పాటు ధీటుగా సినీ ప‌రిశ్ర‌మ‌ను బ‌లోపేతం చేస్తామ‌న్నారు. చిన్న, మధ్య తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు సహా, తెలంగాణను షూటింగ్ గమ్య స్థానంగా మారుస్తామ‌ని చెప్పారు.

ప్రభుత్వం సినీ కార్మికుల సంక్షేమ నిధికి రూ.10 కోట్లు కేటాయిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. సినీ కార్మికుల పిల్లలకు నర్సరీ నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించడానికి కార్పొరేట్-స్టాండర్డ్ పాఠశాలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను కూడా ఆయన వెల్లడించారు. ఇందులో ఉచిత అల్పాహారం, భోజనం కూడా ఉంటుంద‌న్నారు. ప్రతిపాదిత పాఠశాల కోసం కృష్ణనగర్‌లో తగిన భూమిని గుర్తించాలని రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంఘాన్ని ఆదేశించారు. సినీ కార్మికులందరినీ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, రాబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భూమిని కేటాయిస్తామ‌న్నారు.

  • Related Posts

    మార్ఫింగ్ వీడియోపై జూనియ‌ర్ ఎన్టీఆర్ సీరియ‌స్

    హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు సంబంధించి మార్ఫింగ్ వీడియోలు త‌యారు చేసినా లేదా షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ వీడియోపై…

    బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న డైరెక్ట‌ర్ చందూ మొండేటి

    హైద‌రాబాద్ : దర్శకుడు చందూ మొండేటి అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటిలతో కలిసి ఒక లఘు చిత్రంతో బాలీవుడ్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంజయ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *