ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌ను ఆలోచించండి : కేటీఆర్

ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాల‌నకు చెక్ పెట్టండి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘ‌న‌త కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని షేక్‌పేట్‌లోని సత్వా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. ప‌దేళ్లలో పేద‌ల కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని అన్నారు. యావ‌త్ ప్ర‌పంచం హైద‌రాబాద్ వైపు చూసేలా అభివృద్ది చేయడం జ‌రిగింద‌న్నారు కేటీఆర్. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ వంటి ప‌థ‌కాల‌తో పేద కుటుబాల‌కు అండ‌గా నిలిచామ‌ని చెప్పారు. వ్య‌వ‌సాయానికి, ప‌రిశ్ర‌మ‌ల‌కు 24 గంటల క‌రెంటు ఇచ్చాం, నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌కు జీవం పోశామ‌న్నారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మించామ‌ని అన్నారు. బెంగ‌ళూరు లాంటి న‌గ‌రాల్లో ఏడేళ్లు ప‌ట్టే ఫ్లై ఓవ‌ర్ల‌ను మేం అతి త‌క్కువ కాలంలోనే చేశామ‌ని తెలిపారు. ఎన్నో ప‌నులు నాలుగేళ్ల‌లో పూర్తి చేశామ‌న్నారు.

ఈ రెండేళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఏం చేసిందో ఒక్క‌సారి బేరీజు వేసుకోవాల‌ని సూచ‌చించారు కేటీఆర్. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆగ‌మాగం అవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేష‌న్ క్యాంప‌స్ అని అడిగితే టీ హ‌బ్ అని చూపిస్తుందన్నారు. దీనిని ఏర్పాటు చేసింది మేమేన‌ని మీకు తెలియంది కాద‌న్నారు. మేం దేశంలోనే కాదు ప్ర‌పంచం తోనే పోటీప‌డ్డాం అని అన్నారు. మా హ‌యాంలో త‌ల‌స‌రి ఆదాయం రూ. 3.87 ల‌క్ష‌లుగా మార్చేశామ‌న్నారు కేటీఆర్. తాము వ‌చ్చాక 6 ల‌క్ష‌ల ఉద్యోగుల‌ను ఐటీ రంగంలో క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ఎన్నిక కారుకు బుల్డోజ‌ర్ కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *