భ‌క్తుల‌కు సాంప్రదాయ ఆహారం అందించాలి

తిరుమ‌ల‌లోని దుకాణాదారుల‌కు ఏఈవో ఆదేశం

తిరుమల : తిరుమలలోని దుకాణాల్లో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శ్రీ పద్మావతి అతిధి భవనంలోని సమావేశ మందిరంలో పలు శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలని స్ప‌ష్టం చేశారు.

అదే విధంగా తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు వెంక‌య్య చౌద‌రి. దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విభాగం, ఎఫ్ ఎం ఎస్ సేవలు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్ఈడి బోర్డులు, శ్రీ వారి సేవ, వైద్య, ఐటీ, కళ్యాణ కట్ట విభాగాల పనితీరు, తదితర అంశాలను కూడా స‌మీక్షించారు. ఇదే స‌మ‌యంలో భ‌క్తుల నుంచి వ‌చ్చే సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను స్వీక‌రించాల‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    నవంబర్ 16న గోష్పాద క్షేత్రంలో గోదావరి హారతి

    తిరుపతి : గోదావరి నదికి ఆధ్యాత్మిక సంప్రదాయ బద్ధంగా హారతి సమర్పించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపినాథ్ శనివారం టిటిడి శ్వేత సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. టిటిడి, దాస సాహిత్య ప్రాజెక్ట్, పశ్చిమ గోదావరి…

    అప్పలాయగుంట‌ ఆలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు’

    తిరుపతి : మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది. తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *