సి. క‌ళ్యాణ్ ను ఎన్ కౌంట‌ర్ చేస్తే బెట‌ర్

Spread the love

ఐ బొమ్మ ర‌వి తండ్రి అప్పారావు కామెంట్స్

హైద‌రాబాద్ : పైర‌సీ వీడియోలు చ‌ట్ట విరుద్దంగా అప్ లోడ్ చేస్తూ కోట్లాది రూపాయ‌లు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం క‌లిగించాడంటూ ఐబొమ్మ‌, బొప్పం ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌విని సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ సజ్జ‌నార్ అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో త‌న‌ను 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ సంద‌ర్బంగా సినీ రంగానికి చెందిన చిరంజీవి, నాగార్జున‌, నిర్మాతలు దిల్ రాజుతో పాటు సి. క‌ళ్యాణ్ స్పందించారు. పోలీసుల‌ను అభినందించారు. ఈ సంద‌ర్బంగా ప్రొడ్యూస‌ర్ సి. క‌ళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఇమ్మ‌డి ర‌విని ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని, ఇక నుంచి ఎవ‌రూ అలాంటి ప‌నులు చేయ‌రంటూ పేర్కొన్నాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఐబొమ్మ ర‌వి తండ్రి అప్పారావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సి. క‌ళ్యాణ్ ను ఎన్ కౌంట‌ర్ చేస్తే పీడ విర‌గ‌డ అవుతుంద‌న్నారు. ఒక‌రిపై కామెంట్స్ చేసే ముందు ఆలోచించుకుని మాట్లాడాల‌న్నారు. సీ.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంద‌ని అన్నారు అప్పారావు. సినిమాల‌లో ద‌మ్ముంటే జ‌నం క‌చ్చితంగా చూస్తార‌న్నారు. తాను ఒక‌ప్పుడు 45 పైసలతో సినిమా చూశాన‌ని, ఇప్పుడు దారుణంగా రేట్లు పెరిగాయన్నారు ఐ బొమ్మ‌ర‌వి. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారని ప్ర‌శ్నించారు. త‌న‌ కొడుకు తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు అప్పారావు.

  • Related Posts

    మెగాస్టార్ మూవీలో త‌ళుక్కుమ‌న్న ర‌మా నంద‌న

    Spread the love

    Spread the loveనందూస్ వ‌ర‌ల్డ్ పేరుతో యూట్యూబ‌ర్ గా ఫేమ‌స్ హైద‌రాబాద్ : టెక్నాల‌జీ మారింది. డిజిట‌ల్ మీడియా వ‌చ్చాక అవ‌కాశాలు అపారంగా పెరిగాయి. ఎవ‌రైనా స‌రే త‌మ టాలెంట్ తో ఒక్క రోజులోనే పాపుల‌ర్ అవుతున్నారు. ఇందుకు సాక్ష్యం తాజాగా…

    మెగాస్టార్ మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ ఖుష్

    Spread the love

    Spread the loveత‌న‌పై మ‌రింత బాధ్య‌త పెరిగింది గుంటూరు జిల్లా : మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, అందాల తార న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సంచ‌లనం రేపుతోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *