క్రికెట్ రంగంలో మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఐసీసీ చైర్మ‌న్ జే షా

ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ , ఏసీసీ చైర్మ‌న్ జే షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో రోజు రోజుకు క్రికెట్ ఆట అనేది విడ‌దీయ‌రాని బంధంగా పెన‌వేసుకు పోయింద‌న్నారు. ప్రతి ఒక్కరూ తమ కొడుకు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ , సంజూ శాంస‌న్ లాగా మారాలని కోరుకుంటార‌ని అన్నారు. కానీ ఎవరూ తమ కుమార్తె హర్మన్‌ప్రీత్ లేదా స్మృతి మంద‌న్నా లాగా మారాలని కోరుకోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ఆదివారం జే షా ఓ మీడియా ఛాన‌ల్ తో సంభాషించారు. ఈ మేర‌కు క్రికెట్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో మహిళా క్రికెట్ రంగంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు జే షా.

క్రికెట్ రంగంలో పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌ల‌కు కూడా అవ‌కాశాలు క‌ల్పించాల‌ని తాము నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా వారికి భారీ ఎత్తున గౌర‌వ వేత‌నాలు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బీసీసీఐ అందిస్తున్న ప్రోత్సాహం , వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం వ‌ల్ల వారికి ఆట ప‌రంగానే కాదు స‌మాజంలో కూడా కీల‌క‌మైన గుర్తింపు, గౌర‌వం ల‌భించింద‌ని చెప్పారు జే షా. దీని కార‌ణంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మహిళా క్రికెట్ జ‌ట్టు సుదీర్ఘ కాలం త‌ర్వాత వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంద‌ని, ఇదంతా తాము అందించిన సంపూర్ణ స‌హ‌కారం, హెడ్ కోచ్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని చెప్పారు.

  • Related Posts

    భార‌త్ పురుషుల హాకీ జ‌ట్టుకు సీఎం కంగ్రాట్స్

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ భార‌త మెన్స్ హాకీ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. కర్ణాటక మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ నిరంతర విజయాలకు మా శుభాకాంక్షల అని శివకుమార్ అన్నారు. భారతదేశానికి స్వర్ణం సాధించిన భారత పురుషుల…

    ఆసియా క్రీడ‌ల్లో సెమీస్ కు చేరిన టీమిండియా

    జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అనుకోకుండా సెమీస్ కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ICC T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో (నంబర్ 1) ఉండగా, ఆఫ్ఘనిస్థాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *