మేడారంలో కమాండ్ కంట్రోల్ రూమ్
పర్యవేక్షించిన మంత్రులు సీతక్క..సురేఖ
ములుగు జిల్లా – ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ములుగు జిల్లాలోని మేడారం మహా జాతరకు ఏర్పాట్లు చకా చకా జరుగుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు సురేఖ, సీతక్క సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. లక్షలాది మంది తరలి వస్తారని అంచనా. అయితే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే మేడారం జాతర నిర్వహణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ , ఎస్పీలతో కలిసి మంత్రి దాసరి సీతక్క జాతర ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదిలా ఉండగా దేశం నలుమూలల నుంచి మేడారం మహా జాతరకు 50,00,000 మంది భక్తులు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటారని అంచనా. కాగా జాతరలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు మంత్రి సీతక్క. ఇదే సమయంలో సీసీ కెమెరాలు ఎలా పని చేస్తున్నాయనే దానిపై ఆరా తీశారు.