ఐపీఎల్ వేలంపాట‌లో మిల్ల‌ర్ పైనే క‌ళ్ళ‌న్నీ

Spread the love

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంజ‌య్ బంగ‌ర్

ఢిల్లీ : వ‌చ్చే ఏడాది 2026లో నిర్వ‌హించ బోయే ఐపీఎల్ టోర్నీ కోసం ఇప్పటి నుంచే మినీ వేలం పాట ప్రారంభ‌మైంది. కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను ఆయా జ‌ట్లు ట్రేడింగ్ ద్వారా క‌న్ ఫ‌ర్మ్ చేసుకున్నాయి. మిగ‌తా ఆట‌గాళ్ల‌కు సంబంధించి ఆక్ష‌న్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్బంగా ఈసారి కీల‌క‌మైన ఆట‌గాళ్లు, ప్ర‌ధానంగా బౌల‌ర్లు, ఆల్ రౌండ‌ర్ల‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు దృష్టి సారించ‌నున్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు మాజీ కోచ్ సంజ‌య్ బంగ‌ర్. ఆదివారం ఆయ‌న ఓ ఛాన‌ల్ తో త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. ఐపీఎల్ వేలం పాట‌లో ప్ర‌ధానంగా డేవిడ్ మిల్ల‌ర్ టాప్ 3 అత్యంత ఖ‌రీదైన ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా ఉండ బోతున్నాడ‌ని చెప్పాడు. అంతే కాదు త‌న‌తో పాటు భార‌త దేశానికి చెందిన స్టార్ క్రికెట‌ర్లు వెంక‌టేశ్ అయ్య‌ర్, ర‌వి బిష్ణోయ్ కూడా భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయే ఛాన్స్ ఉంద‌న్నాడు.

ఇక విదేశీ ఆట‌గాళ్ల‌లో డారిల్ మిచెల్, లియామ్ లివింగ్‌స్టోన్, కామెరాన్ గ్రీన్, డేవిడ్ మిల్లర్, జానీ బెయిర్‌స్టో వంటి కీలక ఆటగాళ్ల గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు సంజ‌య్ బంగ‌ర్. ఈనెల 16న జ‌ర‌గ‌నుంది టాటా మినీ వేలం పాట‌. కేకేఆర్ అయ్య‌ర్ ను వ‌దులుకోక పోవ‌చ్చని అన్నాడు మ‌రో మాజీ క్రికెట‌ర్ ఎంఎస్కే ప్ర‌సాద్. ఆ జ‌ట్టు త‌ర‌పున బ‌హుళ ప్ర‌తిభ‌ను క‌లిగి ఉన్నాడ‌ని, అందుకే త‌న‌కే ప్ర‌యారిటీ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌న్నాడు. అన్ని ఫార్మాట్ ల‌కు త‌ను స‌రిగ్గా స‌రి పోతాడ‌ని పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫ్రాంచైజీలు ర‌వి బిష్ణోయ్ పై ఫోక‌స్ పెడ‌తాయ‌ని అన్నాడు మ‌రో మాజీ క్రికెట‌ర్. త‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో రాణించాడ‌ని గ‌ర్తు చేశారు. సీఎస్కే స‌ల్మాన్ నిజార్ ను త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని ధోనీ అనుకుంటాడ‌ని స‌బా క‌రీం అన్నాడు.

  • Related Posts

    అమృత ఫ‌డ్న‌వీస్ వ్య‌వ‌హారం స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం

    Spread the love

    Spread the loveప్ర‌పంచ ఫుట్ బాల్ దిగ్గ‌జం మెస్సీతో సెల్ఫీ వైర‌ల్ ముంబై : వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ ప్ర‌స్తుతం భార‌త దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలుత కోల్ క‌తాకు…

    సంజూ శాంస‌న్ సూప‌ర్ ప్లేయ‌ర్

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన షేన్ బాండ్ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట‌ర్ షేన్ బాండ్ ఆస‌క్త‌కిర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , సీఎస్కే జ‌ట్టు స‌భ్యుడు సంజూ శాంస‌న్ గురించి స్పందించాడు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *