శ‌శాంక్ క‌నుమూరిని అభినందించిన సీఎం

ఏషియ‌న్ ఛాంపియ‌న్ షిప్ లో ప్ర‌తిభ

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన ఏపీలోని భీమ‌వ‌రానికి చెందిన శశాంక్ క‌నుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ క్రీడలో అద్బుత‌మైన ప్ర‌తిభ‌ను చాటాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేశాడు. చివ‌ర‌కు ప‌తకాన్ని కైవ‌సం చేసుకున్నాడు. ఈ సంద‌ర్బంగా తాను సాధించిన మెడ‌ల్ తో ముఖ్య‌మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో క‌లిశాడు.

ఈ సంద‌ర్బంగా టోర్నీలో త‌న అనుభ‌వాన్ని ముఖ్య‌మంత్రితో పంచుకున్నాడు. గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ లో తనకు పదేళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ తెలిపారు. రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారుడు శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని ఆకాంక్షించారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాబోయే రోజుల్లో బంగారు ప‌త‌కాల‌తో రావాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు శ‌శాంక్ కు. ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి స‌హాయ‌మైనా చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, క్రీడ‌పై మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు కృషి చేయాల‌ని సూచించారు.

  • Related Posts

    భార‌త్ పురుషుల హాకీ జ‌ట్టుకు సీఎం కంగ్రాట్స్

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ భార‌త మెన్స్ హాకీ జ‌ట్టుకు అభినంద‌న‌లు తెలిపారు. కర్ణాటక మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీ నిరంతర విజయాలకు మా శుభాకాంక్షల అని శివకుమార్ అన్నారు. భారతదేశానికి స్వర్ణం సాధించిన భారత పురుషుల…

    ఆసియా క్రీడ‌ల్లో సెమీస్ కు చేరిన టీమిండియా

    జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అనుకోకుండా సెమీస్ కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ICC T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో (నంబర్ 1) ఉండగా, ఆఫ్ఘనిస్థాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *