మెగా మూవీ స‌క్సెస్ డైరెక్ట‌ర్ , కొరియోగ్రాఫ‌ర్ కు గిఫ్ట్

Spread the love

ఖ‌రీదైన కారును బహూక‌రించ‌ని చిరంజీవి

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది. చిరంజీవి సినీ కెరీర్ లో ఎనిమిది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత భారీ స‌క్సెస్ సాధించిన చిత్రంగా రికార్డ్ న‌మోదు చేసింది. ఇక తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మినిమం గ్యారెంటీ క‌లిగిన ద‌ర్శ‌కుల‌లో టాప్ లో ఉన్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మ‌రోసారి మ్యాజిక్ చేశాడు. కామెడిని పండించాడు. ఈ సినిమాలో చిరంజీవి కంటే ఎక్కువ మార్కులు న‌య‌న‌తార‌, విక్ట‌రీ వెంక‌టేశ్ కు ప‌డ్డాయి. ఈ ఇద్ద‌రూ మూవీకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు.

ఇక మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు రికార్డ్ బ్రేక్ చేసింది వ‌సూళ్ల ప‌రంగా . ఏకంగా అతి త‌క్కువ రోజుల్లోనే రూ. 300 కోట్ల మార్క్ ను చేరింది. ఇది సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇక ఇప్పటి వ‌ర‌కు అనిల్ రావిపూడి త‌న కెరీర్ లో 9 సినిమాలు చేశాడు. అన్నీ బిగ్ హిట్ గా నిలిచాయి. తాజాగా మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మెగాస్టార్ చిరంజీవి అత్యంత ఖ‌రీదైన గిఫ్ట్ ను ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి ఇచ్చారు. అంతేకాకుండా త‌న చేత హూక్ స్టెప్స్ వేయించిన కొరియోగ్రాఫ‌ర్ ఆట సందీప్ ను ఘ‌నంగా స‌న్మించారు. దీనిపై స్పందించాడు సందీప్. త‌న జీవితంలో మ‌రిచి పోలేని స‌న్నివేశం అని పేర్కొన్నాడు.

  • Related Posts

    విజ‌య్ కార్తీక్ తో విడి పోతున్నా : కీర్తి భ‌ట్

    Spread the love

    Spread the loveసోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య విడాకుల ప్ర‌క‌ట‌న‌లు ఎక్కువై పోయాయి. ఇక సినీ రంగంలో ఎవ‌రు ఎప్పుడు క‌లిసి ఉంటారో ఎప్పుడు విడి పోతారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇందుకు అసాధార‌ణ ప‌రిస్థితులు…

    రూ. 300 కోట్లు దాటేసిన స‌న్నీ డియోల్ బోర్డ‌ర్ -2

    Spread the love

    Spread the loveబాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం ముంబై : బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది బోర్డ‌ర్ -2 మొన్న‌టి దాకా ప‌లు సినిమాలు ప‌డుతూ లేస్తూ వ‌చ్చాయి. కానీ ఒక్క‌సారిగా ఆదిత్య ధ‌ర్ తీసిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *