వాంఖ‌డే స్టేడియంలో చెమటోడ్చుతున్న క్రికెట‌ర్లు

Spread the love

రేపే కీల‌క‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఇంగ్లండ్ తో

ముంబై : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. క‌ప్ కైవ‌సం చేసుకునేందుకు టీమిండియాకు కేవ‌లం రెండే రెండు అడుగుల దూరంలో ఉంది. యావ‌త్ ప్ర‌పంచం లోని భార‌తీయ క్రికెట్ అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో వెస్టిండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది టీం ఇండియా. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఏళ్ల‌లో 195 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. 196 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో మైదానంలోకి దిగింది భార‌త జ‌ట్టు . వెంట వెంట‌నే వికెట్లు కోల్పోయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్.

త‌ను ఓపెన‌ర్ గా ప్రారంభించిన ఆట‌ను మ్యాచ్ విజ‌యం సాధించేంత వ‌ర‌కు నిలిచి ఉన్నాడు గోడ‌లా మైదానంలో. విండీస్ గెలుపొంది క‌ప్ ను ఎగ‌రేసుకు పోవాల‌ని అనుకున్న ఆట‌గాళ్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు సంజు శాంస‌న్. కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. విండీ స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. త‌ను 12 ఫోర్లు 4 సిక్సుల‌తో హోరెత్తించాడు. 97 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓడి పోతామ‌ని అనుకున్న మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. సెమీస్ కు ఇండియాను చేర్చాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం జ‌ర‌గ‌నుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఆట‌గాళ్లు చెమ‌టోడ్చుతున్నారు. ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *