భ‌క్తుల‌కు నిర్దేశిత స‌మ‌యంలోనే అనుమ‌తి

Spread the love

స‌ర్వ ద‌ర్శ‌నం , రూ. 300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్తుల ద‌ర్శ‌నానికి సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌, చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఇదిలా ఉండ‌గా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు.

ఈ నిబంధనను ఈ వారం నుంచే టీటీడీ కఠినంగా అమలు చేస్తోందని చెప్పారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందుగా వచ్చి ఇబ్బంది పడవద్దని సూచించారు . అలాగే సమయం పాటించే భక్తులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. భక్తులందరికీ సౌకర్య వంతమైన, ముంద‌స్తుగ దర్శనం కల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. కాగా పాల‌క‌మండ‌లి తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమకు కేటాయించిన సమయానికే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని కోరారు ఈవో.

  • Related Posts

    జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం –…

    మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *