ప్రభుత్వం తనకు అండగా ఉంటుందని హామీ
హైదరాబాద్ : భారత క్రికెట్ కు చెందిన ఆటగాడు తిలక్ వర్మ మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. టి20 ప్రపంచ కప్-2026 లో భారత జట్టు విజయం సాధించడంలో తను కూడా కీలక పాత్ర పోషించాడు. కీలకమైన సమయంలో కొద్ది పరుగులు చేసినా తను ఇంపాక్ట్ ప్లేయర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా టీం ఇండియా ఆటగాడు తిలక్ వర్మ తనను కలుసు కోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా తిలక్ వర్మను ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారు. మరిన్ని రికార్డులు నమోదు చేయాలని కోరాడు. అటు దేశానికి ఇటు రాష్ట్రానికి పేరు తీసుకు రావాలని కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, SATG చైర్మన్ శివసేనారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.






