శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ

Spread the love

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ర‌విచంద్ర‌

తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్ భక్తులకు, ఉద్యోగులకు, అర్చకులకు, ప్రజలకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సరాన్ని ఆనందంగా, భక్తి భావంతో జరుపుకోవాలని వారు కోరుకున్నారు. శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఆ దేవ దేవుడు, క‌లియుగ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని నిత్యం కోట్లాది మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటార‌ని తెలిపారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు చైర్మ‌న్, ఈవో. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. నూత‌న భ‌వ‌నాల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు బీఆర్ నాయుడు, ముద్దాడ ర‌విచంద్ర‌.

  • Related Posts

    చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు

    Spread the love

    Spread the loveఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంట‌ల‌కు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండ రాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.గజరాజులు…

    టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం

    Spread the love

    Spread the loveఅభినందించిన ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌ తిరుప‌తి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ఇక్క‌డ కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు ప్ర‌తినిత్యం కోట్లాది మంది వ‌స్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ని ప్ర‌గాఢ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *