తిరుమ‌ల‌లో సీఎం కుటుంబానికి ఆశీర్వాదం

Spread the love

శ్రీ‌వారి చిత్ర‌ప‌టం, ప్ర‌సాదం అంద‌జేసిన చైర్మ‌న్

తిరుమ‌ల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రాన్ని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న వెంట ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, భార్య నారా భువ‌నేశ్వ‌రి, మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ ఉన్నారు. ప్రోటోకాల్ ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న సామాన్యుడిలాగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందారు.

ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించగా, అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటం, పంచాంగం, ప్రసాదాలను అందజేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈవోలు వి. వీర‌బ్ర‌హ్మం, డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ తో పాటు బోర్డు స‌భ్యులు కూడా హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    అన్న ప్ర‌సాదానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం

    Spread the love

    Spread the loveభ‌క్తుల‌కు స్వ‌యంగా వడ్డించిన భువ‌నేశ్వ‌రి తిరుమ‌ల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని శ‌నివారం సంద‌ర్శించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుటుంబం. బాబుతో పాటు కొడుకు, మంత్రి…

    శ్రీ‌వారి భ‌క్తుల‌కు స్వ‌యంగా వ‌డ్డించిన సీఎం

    Spread the love

    Spread the loveఎన్టీఆర్ పెట్టిన ట్ర‌స్ట్‌..దేవాన్ష్ విరాళం తిరుమ‌ల : తిరుమ‌ల లోని శ్రీ‌వారిని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌, నారా బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి, దేవాన్ష్ శ‌నివారం క్యూ కాంప్లెక్స్ ద్వారా ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *