అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

Spread the love

సీఎస్కే జ‌ట్టులో చేరిన కేర‌ళ క్రికెట‌ర్

చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో టాప్ లో నిలిచాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను దేశ వ్యాప్తంగా హీరోగా మారాడు. అంతే కాదు త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌కు విప‌రీతంగా ఫ్యాన్స్ పెరిగారు. ఇది ఊహించ‌ని ప‌రిణామం. త‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి భాగంలో ఆడ‌లేదు. అంత‌కు ముందు న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో 5 మ్యాచ్ ల‌లో 50 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యాడు. ఇందులో ఒక డ‌కౌట్ కూడా ఉంది. ఆ త‌ర్వాత వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో భాగ‌మైనా త‌నను కీల‌క మ్యాచ్ ల‌కు దూరంగా పెట్టాడు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి అభిషేక్ శ‌ర్మ‌కు అనారోగ్యం కావ‌డంతో త‌న స్థానంలో న‌మీబియాతో ఎంట‌ర్ అయ్యాడు. ఇందులో 22 ర‌న్స్ చేశాడు. జింబాబ్వేతో 24 చేశాడు.

కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ కీల‌క మ్యాచ్ లో విండీస్ పై 97 ర‌న్స్ చేశాడు. త‌ను లేక పోతే జ‌ట్టు గెలిచేది కాదు. అది పూర్తిగా సెమీస్ కు తీసుకు వెళ్లాడు. ఇంగ్లండ్ తో జ‌రిగిన సెమీస్ లో 89 ప‌రుగులు చేశాడు. త‌ను కీ రోల్ పోషించాడు. ఇక అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో సూప‌ర్ షో చేశాడు. ఇందులో కూడా 89 ర‌న్స్ చేశాడు. ఇండియా విశ్వ విజేత‌గా నిల‌వ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు. త‌ను 5 ఇన్నింగ్స్ ల‌లో 321 ర‌న్స్ చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా గెలుపొందాడు. ఇక ఐపీఎల్ లో కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వ‌హించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం సీఎస్కే త‌ర‌పున ఆడుతున్నాడు. ఇప్పుడు అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే ఉన్నాయి.

  • Related Posts

    టి20 జ‌ట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?

    Spread the love

    Spread the loveకెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ కంటిన్యూ ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జ‌ట్టును ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. త‌న సార‌థ్యంలో…

    అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

    Spread the love

    Spread the love46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 ర‌న్స్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో యంగ్ క్రికెట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ, చెన్నై సూపర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *