ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

6 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ఓట‌మి

బెంగ‌ళూరు : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాక్ ఇచ్చింది. నిర్దేషించిన 201 ప‌రుగుల లక్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించింది. కేవ‌లం 15.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. ఇక టాస్ ఓడి పోయి ముందుగా మైదానంలోకి దిగింది ఎస్ ఆర్ హెచ్. ఆశించిన మేర రాణించ లేక పోయారు. విరాట్ కోహ్లీ, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ లు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. జ‌ట్టుకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన గెలుపును అందించారు.

కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్టిన ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. త‌ను ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. తోటి ఆట‌గాళ్లు విఫ‌ల‌మైనా ఎక్క‌డా తొణ‌క‌లేదు. ట్రావిస్ హెడ్ 11 ర‌న్స్ చేస్తే అభిషేక్ శ‌ర్మ కేవ‌లం 7 ప‌రుగులే చేసి నిరాశ ప‌రిచాడు. ఇక మిడిల్ ఆర్డ‌ర్ లో వ‌చ్చిన నితీశ్ కుమార్ రెడ్డి ఒక ప‌రుగుతో స‌రిపెట్టుకుంటే , స‌లీల్ అరోరా 9 ర‌న్స్ , హ‌ర్ష్ దూబే 3 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. క్లాసెన్ తో క‌లిసి ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు కెప్టెన్ ఇషాన్ కిష‌న్. త‌ను ఒక్క‌డే 80 ర‌న్స్ చేశాడు. ఇక బెంగ‌లూరు జ‌ట్టులో కోహ్లీ 61 ర‌న్స్ చేసి కీ రోల్ పోషించాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *