జీవ‌న్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ‌తారు..?

ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్న గౌడ్

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన మాజీ మంత్రి టి. జీవ‌న్ రెడ్డి త‌ను పార్టీ వీడడం ప‌ట్ల స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది. త్వ‌ర‌లో ఆయ‌న గులాబీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. రేవంత్ రెడ్డిని మారిస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ది చెంద‌ద‌న్నారు. కేవ‌లం త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోస‌మే పని చేస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను ప‌క్క‌న పెట్టార‌ని మండిప‌డ్డారు.

ఈ సంద‌ర్బంగా మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి చేసిన దారుణ‌మైన కామెంట్స్ పై స్పందించారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. త‌నంటే త‌మ‌కు కూడా గౌర‌వం ఉంద‌న్నారు. పార్టీ హైక‌మాండ్ ఆదేశాల మేర‌కు తాను, మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు త‌న‌ను న‌చ్చచెప్పే ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. కానీ త‌ను వినిపించు కోలేద‌న్నారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేదని, ఇక జీవ‌న్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ‌తారంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న తిరిగి త‌మ పార్టీలోకి రావాల్సిందేన‌ని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. అది దోపిడీ చేసిన పార్టీ. ఇక బీజేపీ మ‌తం, కులం త‌ప్ప ఆ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *