జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్

Spread the love

కొన్ని ష‌ర‌తులు విధించిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, వైస్ఆర్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 20 నుంచి మే 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంద‌ని , ఇందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి ఇవ్వాల‌ని పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దేశం విడిచి వెళ్లేముందు ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ష్యూరిటీని సీబీఐ అధికారులకు అందజేయాలని ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు ఆదేశించింది.

గ‌తంలో యూపీఐ హ‌యాంలో కొలువు తీరిన స‌మ‌యంలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీబీఐ కోర్టు త‌న‌పై కేసు న‌మోదు చేసింది. ఈ కేసు ఇంకా కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఇదే క్ర‌మంలో త‌న‌పై న‌మోదు చేసిన కేసుల‌కు సంబంధించి స్పందించారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇదంతా కావాల‌ని త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. రాబోయే రోజుల్లో తాను నిర్దోషిగా బ‌య‌ట ప‌డ‌తాన‌ని, త‌న‌కు ఆ న‌మ్మ‌కం ఉంద‌న్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

  • Related Posts

    రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే డీ లిమిటేష‌న్ : ఎంపీ

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ న్యూఢిల్లీ : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం తీసుకు వ‌స్తున్న డీ లిమిట‌నేష‌న్ బిల్లును ఏకి పారేశారు. కేవ‌లం రాజ‌కీయంగా ల‌బ్ది…

    ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు

    Spread the love

    Spread the loveరవీంద్రభారతిలో తెలంగాణ అస్థిత్వ వేదిక హైద‌రాబాద్ : వంద‌లాది మంది బ‌లిదానం చేయ‌డంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ప‌ది సంవ‌త్స‌రాల పాటు ఆత్మ గౌరవం భంగం వాటిళ్ల‌కుండా ప్ర‌య‌త్నం చేశారు బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్. కానీ అనూహ్యంగా దొర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *