ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు

Spread the love

రవీంద్రభారతిలో తెలంగాణ అస్థిత్వ వేదిక

హైద‌రాబాద్ : వంద‌లాది మంది బ‌లిదానం చేయ‌డంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ప‌ది సంవ‌త్స‌రాల పాటు ఆత్మ గౌరవం భంగం వాటిళ్ల‌కుండా ప్ర‌య‌త్నం చేశారు బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్. కానీ అనూహ్యంగా దొర చేసిన నిర్వాకం కార‌ణంగా ప్ర‌జ‌లు ఛీ కొట్టారు. ఆపై అహంకారానికి చెక్ పెట్టారు. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీకి ప‌వ‌ర్ ను అప్ప‌గించారు. తీరా రేవంత్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో అస్తిత్వం అన్న‌ది లేకుండా పోయింది. ఈ త‌రుణంలో మేధావులు మ‌ళ్లీ మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు. ఇందుకు కీల‌క‌మైన తెలంగాణ మేధావులు ముందుకు వ‌చ్చారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అస్తిత్వ వేదికను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అప‌ర మేధావి వి. ప్ర‌కాష్.

శుక్ర‌వ‌రాం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ అస్థిత్వ వేదిక సమావేశం జ‌రిగింది. 14 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ 12 ఏళ్ల తర్వాత తెలంగాణ అస్థిత్వంపై దాడి జరుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పటికీ చంద్రబాబుతో పాటు ఆంధ్రా నాయకులు మన మీద దుర్భాష లాడుతున్నారని ఆరోపించారు. తాజాగా బీజేపీకి చెందిన క‌ర్ణాట‌క ఎంపీ తేజ‌స్వి సూర్య పార్ల‌మెంట్ సాక్షిగా నోరు పారేసుకున్నారు. మన సంస్కృతి ప్రతీకలు మాయమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జలవనరులకు సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి నెల‌కొంద‌ని పేర్కొన్నారు రిటైర్డ్ ఇంజినీర్ శ్రీధర్ రావు దేశ్ పాండే.

  • Related Posts

    రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే డీ లిమిటేష‌న్ : ఎంపీ

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ న్యూఢిల్లీ : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం తీసుకు వ‌స్తున్న డీ లిమిట‌నేష‌న్ బిల్లును ఏకి పారేశారు. కేవ‌లం రాజ‌కీయంగా ల‌బ్ది…

    జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్

    Spread the love

    Spread the loveకొన్ని ష‌ర‌తులు విధించిన సీబీఐ కోర్టు హైదరాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, వైస్ఆర్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *