ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టుకు విరామం కావాలి

Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ రిష‌బ్ పంత్

ల‌క్నో : ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లీగ్ కీల‌క మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 8 వికెట్లు కోల్పోయి 155 ర‌న్స్ చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా త‌ల‌దించ‌కుండా అద్భుతంగా ఆడాడు జ‌ట్టు కోసం యంగ్ క్రికెట‌ర్ రింకూ సింగ్ . త‌ను 83 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 155 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్ అవ‌స‌ర‌మైంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఎల్ఎస్జీ కేవ‌లం ఒకే ఒక్క ర‌న్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన రింకూ సింగ్ తొలి బంతికే ఫోర్ బాదాడు. కోల్ క‌తాకు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు.

ఈ సంద‌ర్బంగా ల‌క్నో జ‌ట్టు కెప్టెన్ రిష‌బ్ పంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మాకు కచ్చితంగా ఒక విరామం అవసరమని నేను భావిస్తున్నాను. ఈ విరామం మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది, ప్రతి మ్యాచ్ కూడా ఒత్తిడితో కూడుకున్నదే అవుతుంది; అయితే అదే సమయంలో, మనం పరిష్కారాల కోసం బయట కాకుండా, మనలోనే వెతుక్కోవాలి అని అన్నాడు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తామే స్వీకరించాలి. ఇది కేవలం ఒకరిద్దరికి సంబంధించిన విషయం కాదు; ఇది జట్టు మొత్తానికి సంబంధించిన విషయం. నిస్సందేహంగా, చాలామంది ఆటగాళ్లు ఈ బాధ్యతను స్వీకరిస్తారని అన్నాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2026 టైటిల్ ప‌క్కా మాదే : పరాగ్

    Spread the love

    Spread the loveరాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ కామెంట్స్ ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026 లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. తొలుత బ్యాటింగ్ చేసింది…

    స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డాన్ని ఇష్ట ప‌డ‌తా

    Spread the love

    Spread the loveఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సూర్య‌వంశీ ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో దుమ్ము రేపుతున్నాడు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను పంజాబ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో దుమ్ము రేపాడు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *