భువ‌నేశ్వ‌ర్ కుమార్ భ‌ళా ఢిల్లీ విల విల

3 ఓవ‌ర్లు 5 ప‌రుగులు 3 కీల‌క‌మైన వికెట్లు

న్యూఢిల్లీ : స్వంత గడ్డ‌పై అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు కేవ‌లం 75 ర‌న్స్ మాత్ర‌మే చేసి ఆలౌటైంది. ఆర్సీబీని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఓడించిన ఢిల్లీకి బ‌దులు తీర్చుకుంది ఆర్సీబీ. ఆ జ‌ట్టు బౌల‌ర్లు జోస్ హాజిల్ వుడ్ , భువ‌నేశ్వ‌ర్ కుమార్ లు క‌ళ్లు చెదిరే బంతుల‌తో కోలుకోలేని షాక్ ఇచ్చారు. జోష్ 12 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీస్తే భువీ కేవ‌లం 3 ఓవ‌ర్ల వేసి 5 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 కీల‌క‌మైన వికెట్లు కూల్చారు. అనంత‌రం 76 ప‌రుగుల టార్గెట్ ను కేవ‌లం ఆరు ఓవ‌ర్ల‌లోనే ప‌ని కానిచ్చేసింది ఆర్సీబీ . 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

ఇక భువనేశ్వర్ కుమార్ విష‌యానికి వ‌స్తే త‌ను ఇప్పుడు ఇండియా జ‌ట్టులో లేడు. దీనికి కార‌ణం త‌న‌లో వేగం త‌గ్గింద‌ని కార‌ణం చెప్పాడు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. కానీ అతని స్వింగ్ ఇప్పటికీ అత్యుత్తమ బ్యాటర్లను వ‌ణికించేలా చేసింది. తన మొదటి 2 ఓవర్లలోనే కేవలం 3 పరుగులకే 3 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాప్ ఆర్డర్‌ను చిన్నాభిన్నం చేశాడు. 200 IPL వికెట్ల చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు, ఈ ఘనత సాధించిన రెండవ బౌలర్‌గా నిలిచాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *