Friday, 16 October 2026

ఇది ఊహించ‌ని ప‌రాజ‌యం : అక్స‌ర్ ప‌టేల్

newsseals-AxarPatel

ఆర్సీ బీ చేతిలో 9 వికెట్ల తేడాతో అప‌జ‌యం

న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల భారీ తేడాతో ఓట‌మి పాలు కావ‌డం ప‌ట్ల స్పందించాడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్. తాము ఊహించ‌ని విధంగా ఓడి పోయామ‌ని , దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆర్సీబీ బౌల‌ర్లు చేసిన బౌలింగ్ అని పేర్కొన్నాడు. త‌మ టాప్ ఆర్డ‌ర్ ను కుప్ప కూల్చేలా చేయ‌డంలో జోష్ హాజిల్ వుడ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్ లు కీల‌క పాత్ర పోషించార‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. మా బ్యాట‌ర్లు అలా వ‌చ్చి ఇలా వెళ్లి పోయార‌ని దీనికి ఎలాంటి కార‌ణాలు తాము వెతక‌డం లేద‌న్నాడు.

ఇక మిగిలింది మిగిలిన మ్యాచ్ ల‌లో నైనా మెరుగైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం త‌మ‌పై ఉంద‌న్నారు. దీనికి తాను ఎవ‌రినీ నిందించ‌డం లేద‌న్నాడు అక్ష‌ర్ ప‌టేల్. పవర్‌ప్లేలోనే మేము మ్యాచ్‌ను చేజార్చుకున్నామని అన్నాడు. పవర్‌ప్లేలో 6 వికెట్లు పడి పోయినప్పుడు, మేము 49 పరుగుల లోపే ‘ఆల్ అవుట్’ అవుతామేమోనని నాకు కాస్త ఆందోళన కలిగిందన్నాడు. ఈ రోజును మేము ఎంత త్వరగా మర్చిపోతే, మాకు అంత మంచిది. ఇది మాకు ఎంతో అవమానకరమైన ఓటమి అని వాపోయాడు స్కిప్ప‌ర్ ప‌టేల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *