ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అభిషేక్ శర్మ
ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ప్రధానంగా పవర్ ప్లేలో పరుగుల వరద పారించారు ఓపెనర్లు యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ, సీనియర్ ఆటగాడు ట్రావిస్ హెడ్. తను ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను కొంతకాలంగా ట్రావిస్ హెడ్ ఆటను గమనిస్తూ వస్తున్నానని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నాడు. అతను బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి, ఇన్నింగ్స్‌కు నాంది పలికే విధానం అద్భుతం అని ప్రశంసించచాడు.. అతనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మజాగా ఉంటుందని కామెంట్ చేశాడు అభిషేక్ శర్మ. కేవలం బంతిని నిశితంగా గమనిస్తూ, అది మనకు అనుకూలంగా వస్తే, మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటమే. నేను కలిసి ఆడటానికి ఇష్టపడే బ్యాటర్లలో సంజూ శాంసన్ తర్వాత ట్రావిస్ హెడ్ అని పేర్కొన్నాడు.






