విజ‌య‌వాడ ఉత్స‌వం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు

అమరావతి : విజయవాడ ఉత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ కార్నివల్‌గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్పీకర్ కార్యాలయంలో సోమ‌వారం శాసన సభ్యులు బోండా ఉమా , గద్దే రామ్మోహన్ , బోడె ప్రసాద్ మర్యాద పూర్వకంగా స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడును కలిశారు. విజయవాడ ఉత్సవానికి రావాల్సిందిగా ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎంజీ రోడ్, ఘంటసాల సంగీత కళాశాల, విజయవాడ ఎక్స్పో వేదికలపై జరిగే ఈ ఉత్సవం విజయవాడ సాంస్కృతిక గౌరవాన్ని మరింతగా పెంచుతుందని ఆశా భావం వ్య‌క్తం చేశారు.

ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై కొలువు తీరిన శ్రీ‌క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ రి దసరా శోభాయాత్రల నడుమ జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా ఒక్క నగరం – ఒకే ఉత్సవం అనే భావనతో నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు అయ‌య‌న్న‌పాత్రుడు. . యువ సోంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. దేవి కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అయ్య‌న్న పాత్రుడు ఆకాంక్షించారు.

  • Related Posts

    నేనే సీఎం నేనే సుప్రీం : సిద్ద‌రామ‌య్య

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి సీఎం సిద్ద‌రామ‌య్య‌ను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్య‌మంత్రి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అవ‌న్నీ పుకార్లు త‌ప్ప వాస్త‌వం కాద‌న్నారు.…

    బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈమేర‌కు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *