ఇది ఊహించ‌ని అపజ‌యం : హార్దిక్ పాండ్యా

Spread the love

మ‌రోసారి సీఎస్కే చేతిలో ఓట‌మిపై కామెంట్స్

చెన్నై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో మ‌రోసారి ఓట‌మి పాలైంది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్. తొలుత ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన పోరులో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ లో సూప‌ర్ సెంచ‌రీ చేశాడు సంజు శాంస‌న్. చెన్నై బౌల‌ర్ల దెబ్బ‌కు 104 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. తాజాగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ‌రో మ్యాచ్ లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియ‌న్స్ . నిర్ణీత 20 ఓవర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి కేవ‌లం 159 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో ప‌ని పూర్తి చేసింది. 160 ర‌న్స్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ కార్తీక్ లు సూప‌ర్ షో చేశారు. రుతురాజ్ 67 ర‌న్స్ తో నాటౌట్ గా నిల‌వ‌గా కార్తీక్ శ‌ర్మ 57 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఇక ఎప్ప‌టి లాగే సంజు శాంస‌న్ నిరాశ ప‌రిచాడు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 2 సెంచ‌రీల‌తో స‌రి పెట్టుకున్నాడు. మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌డం ప‌ట్ల స్పందించాడు హార్దిక్ పాండ్యా. వ‌రుస‌గా ఓట‌మి పాలు కావ‌డం ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నాడు. మా ఆట తీరు మార్చు కోవాల్సి ఉంద‌న్నాడు.

  • Related Posts

    కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ రాడు : దినేష్ కార్తీక్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ చెన్నై : టీ20 క్రికెట్ ఎదుగుతున్న తీరుపై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్, టీ20లకు కావాల్సిన నైపుణ్యాలు పూర్తిగా భిన్నంగా…

    అంపైర్ నిర్ణ‌యం ర‌జ‌త్ పాటిదార్ ఆగ్ర‌హం

    Spread the love

    Spread the loveత‌ప్పుడు డెసిష‌న్ ఫ‌లితం మార్చేస్తుందిఅహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గిల్ నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 6 వికెట్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *