సంజు శాంస‌న్ ఆట తీరు అత్య‌ద్బుతం

Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన కామెంటేట‌ర్ భోగ్లే

ఢిల్లీ : హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ క్రికెట్ అన‌లిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని పేర్కొన్నాడు. త‌న ఆట తీరు రోజు రోజుకు అద్భుతంగా మారుతోంద‌ని అన్నాడు. చూసేందుకు క‌ళ్లు చాల‌డం లేద‌న్నాడు. ఈ సీజ‌న్ లో త‌ను ఇప్ప‌టికే రెండు సెంచ‌రీలు చేశాడ‌ని, ఇప్పుడు ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో త‌ను సాధించిన 87 ప‌రుగుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన చాలా ఇన్నింగ్స్ ల‌లో ఈ ఇన్నింగ్స్ అత్యంత ప్ర‌త్యేక‌మైన‌ద‌ని కొనియాడారు.

ఓ వైపు పిచ్ రాను రాను ఇబ్బందిగా మారుతోంది. మ‌రో వైపు బౌల‌ర్ల‌కు అనుకూలంగా ఉంటున్న స‌మ‌యంలో 8 ఓవ‌ర్ల వ‌ర‌కు ప‌రుగులు చేసేందుకు చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు నానా తంటాలు ప‌డ్డార‌ని, కానీ ఆ త‌ర్వాత సీన్ పూర్తిగా మారి పోయింద‌న్నాడు. దీనికి ప్ర‌ధాన కార‌కుడు సంజు శాంస‌న్ అని ప్ర‌శంసించాడు. ప్రతి బ్యాటర్ ఇబ్బంది పడుతున్న పిచ్ ఇది. బ్యాటర్లకు ఇది ఏమాత్రం సరైన బ్యాటింగ్ పిచ్ కాదు. సంజు శాంసన్ తన అనుభవాన్ని అంతా రంగంలోకి దించాడు. అతను క్రీజ్‌లో చురుకుగా, లెక్కలతో ఆడుతున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం జట్టుకు అదే చాలా అవసరం. అతను ఒక బ్యాటర్‌గా ఎదుగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది గొప్ప శుభవార్త అని అన్నాడు భోగ్లే.

  • Related Posts

    సంజు శాంస‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్

    Spread the love

    Spread the love87 ర‌న్స్ 52 బంతులు 7 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌రోసారి స‌త్తా చాటాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు.…

    ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది

    Spread the love

    Spread the loveమాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *