ఒత్తిడిని త‌ట్టుకుని ఆడ‌డంలో శాంస‌న్ బెస్ట్

Spread the love

ర‌విచంద్ర‌న్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్

చెన్నై : ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును త‌మ స్వంత గ‌డ్డ‌పై ఉతికి ఆరేసింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కో ల్పోయి 155 ర‌న్స్ చేసింది. అనంత‌రం 17.3 ఓవ‌ర్ల‌లో సీఎస్కే కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈసారి సూప‌ర్ షో చేశాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను కేవ‌లం 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను 87 ర‌న్స్ చేసి అజేయంగా నిలిచాడు. మ‌రో వైపు కార్తీక్ శ‌ర్మ 47 ర‌న్స్ చేసి తోడుగా నిలిచాడు.

మ్యాచ్ విన్నింగ్ లో కీల‌క పాత్ర పోషించిన సంజు శాంస‌న్ ప్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డు పొందాడు . ఈ సందర్భంగా స్పందించాడు మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్. సంజు సామ్సన్ ఇప్పుడు ఒక క్లచ్ ప్లేయర్. ఒత్తిడి వచ్చినప్పుడల్లా, అతను ముందుకు వచ్చి రాణిస్తాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన ఐపీఎల్ సీజన్ కావచ్చు. అతను ప్రతి సంవత్సరం 500 పరుగులు చేసే ఆటగాడు కాదు, కానీ ఈసారి అది ఖాయంగా కనిపిస్తోంది. గత 18 నెలల్లో, అతను పూర్తిగా మారి పోయాడని ప్ర‌శంసించాడు.
అతను కఠినమైన వికెట్లపై ఇబ్బంది పడ్డాడు, కానీ ఈరోజు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆ అడ్డంకిని అధిగమించాడు. ఇక్కడి నుండి, అతను మరింత ప్రమాదకరంగా మారతాడు .

  • Related Posts

    సంజు శాంస‌న్ ఆడిన తీరు సింప్లీ సూప‌ర్

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన ఇయాన్ మోర్గాన్ ఢిల్లీ : మాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ఆట తీరు అద్భుతం…

    సంజు శాంస‌న్ ఆట తీరు అత్య‌ద్బుతం

    Spread the love

    Spread the loveప్ర‌శంస‌లు కురిపించిన కామెంటేట‌ర్ భోగ్లే ఢిల్లీ : హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌ముఖ క్రికెట్ అన‌లిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని పేర్కొన్నాడు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *