newsseals.com
News

రైతుల ధాన్యానికి మెరుగైన ధ‌ర క‌ల్పించాలి

VijayaBhaskar May 7, 2026
newsseals-APCM
Spread the love

ఆదేశించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి కీల‌క సూచన‌లు చేశారు. ఈసారి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌ధానంగా రైతులు పండించిన ధాన్యానికి మెరుగైన ధ‌ర క‌ల్పిస్తామ‌న్నారు సీఎం. ఉద్యాన‌, వ్యవ‌సాయ రంగాల‌పై స‌మీక్ష చేప‌ట్టారు స‌చివాల‌యంలో. అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకో లాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సీజన్ కంటే ముందే రాష్ట్రంలోని నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను సరఫరా చేయాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే పంట సీజన్ కు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. నాఫెడ్ నుంచి మినుములు ఇతర వాణిజ్య పంటల్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. పీఎండీఎస్ పథకం ద్వారా తక్కువ యూరియా వినియోగానికి ఇచ్చే ప్రోత్సాహకం పై కేంద్రంతో మాట్లాడాలని సీఎం వారికి సూచించారు. మదనపల్లె లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కానుందని సీఎం ప్ర‌క‌టించారు.