ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం

Spread the love

దాత‌ల‌ను అభినందించిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు

తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ట్రస్టీ అనురాగ్ చౌదరి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు విరాళం డీడీని సమర్పించారు. ఈ సందర్భంగా దాత అనురాగ్ చౌదరి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఎంతో ఉపయుక్తమవుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, శాప్ ఛైర్మన్ శ్రీ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి వార్షిక వ‌సంతోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం స్వామి వారు స్వ‌ర్ణ ర‌థంపై ఊరేగుతారు.
బంగారు తేజస్సుతో అలంకరించిన స్వర్ణ రథంపై దివ్య మంగళ దర్శనం ఇవ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి స‌న్నిధిలో పుత్తిగే మఠం పీఠాధిపతి

    Spread the love

    Spread the loveశ్రీవారి ఆలయంలో పూజల నిర్వ‌హ‌ణ తిరుమల : ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. ఇదిలా ఉండ‌గా ఉడుపిలోని శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ…

    ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

    Spread the love

    Spread the loveఅజ్ఞాత భక్తుడి సేవాభావం ఈవో సంతోషం తిరుప‌తి : కోరిన కోరిక‌లు తీర్చే క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించు కునేందుకు భక్తులు నిత్యం తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తుంటారు. త‌మ మొక్కులు తీర్చుకుంటారు. పెద్ద ఎత్తున న‌గ‌దు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *