ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ

Spread the love

లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై కామెంట్స్

ల‌క్నో : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు , ర‌న్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌డంపై స్పందించాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇరు జ‌ట్లు గెలుపు కోసం శ్ర‌మించాయ‌ని, మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగింద‌న్నాడు. అయితే ల‌క్నో మాకంటే మ‌రింత మెరుగ్గా ఆడింద‌ని కితాబు ఇచ్చాడు. నిజం చెప్పాలంటే, ఇది చాలా మంచి, పోటీతో కూడిన మ్యాచ్. ఇరు జట్లు తమ వంతు ఉత్తమంగా ప్రయత్నించాయి, కానీ మ్యాచ్ గెలిచినందుకు ఎల్‌ఎస్‌జికి అభినందనలు తెలియ చేస్తున్నా.

నేను ప్రత్యేకంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్ ప్రిన్స్ యాదవ్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను, అతను చాలా బాగా బౌలింగ్ చేసి కొన్ని అద్భుతమైన బంతులు వేశాడని ప్ర‌శంస‌లు కురిపించాడు విరాట్ కోహ్లీ. భవిష్యత్తులో అతను ఇంకా మెరుగ్గా రాణిస్తాడని ఆశిస్తున్నానని అన్నాడు. కాగా పదేపదే వికెట్లు కోల్పోతున్నప్పటికీ, మా బ్యాటర్లు పోరాడి నిలబడిన తీరు, చూపిన పట్టుదల నిజంగా అద్భుతం అన్నాడు. రాబోయే మ్యాచ్‌లలో మేము మరింత మెరుగ్గా ఆడి తదుపరి దశకు అర్హత సాధిస్తామనే న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నాడు.

  • Related Posts

    చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ర‌జత్ పాటిదార్ ల‌క్నో : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు ఓట‌మి పాలైంది. చివ‌రి దాకా వ‌చ్చి చేతులెత్తేసింది. ప్ర‌ధానంగా ల‌క్నో…

    ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

    Spread the love

    Spread the loveఈ ఐపీఎల్ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌లేం ల‌క్నో : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *