గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు

99.35 లక్షల ఎకరాలకు సాగునీరు

అమ‌రావ‌తి : ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీర‌డంతో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌ధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ మేర‌కు రాష్ట్ర బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా నిధుల‌ను కేటాయించింది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్ర‌ధాన ప్రాజెక్టుల‌కు మ‌ర‌మ్మ‌తుల‌ను చేప‌ట్టింది. దీని కార‌ణంగా నీటి నిల్వ సామ‌ర్థ్యం పెంచేలా చేసింది. దీని కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు పెరిగింది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా, 887.90 టీఎంసీల నీటి వినియోగం జరిగినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే 2024-25 ఖరీఫ్‌లో 96.22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు.

గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్, వంశధార, తాడిపూడి, ఎస్‌ఆర్‌బీసీ, తుంగభద్ర తదితర ప్రధాన ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులకు ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, సాగునీటి లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఎటువంటి నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు పూర్తి మద్దతు అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *