ముంబై ఇండియన్స్ ఔట్
రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్. ఈ జట్టుకు ఈసారి ఏదీ కలిసి రాలేదు. తిలక్ వర్మ 42 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్స్ లతో 57 రన్స్ చేశాడు. తనతో పాటు నమన్ ధీర్ 32 బంతులు ఆడి 5 ఫోర్లు 2 సిక్సులు 47 రన్స్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్నీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్స్ విజయం సాధించేందుకు నానా తంటాలు పడింది.
స్వల్ప టార్గెట్ ఉన్నప్పటికీ ఆర్సీబీ పరుగుల వేటలో తడబడింది. ఆర్సీబీకి చెందిన కృనాల్ పాండ్యా 46 బంతులు ఆడి 73 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయింది. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్బుతమైన సెల్ తో బెంబేలెత్తించాడు. తను 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొలి మూడు ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ జట్టును వణికించాడు. ఆ జట్టు మూడు ఓవర్లు ముగిసే సరికి 3 కీలక వికెట్లు కూల్చాడు.






