తిప్పేసిన భువ‌నేశ్వ‌ర్ త‌ల్ల‌డిల్లిన ముంబై

4 ఓవ‌ర్లు 23 ప‌రుగులు 4 వికెట్లు

రాయ్ పూర్ : డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు చెందిన స్టార్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ స‌త్తా చాటాడు. మ‌రోసారి త‌న అద్భుత‌మైన స్పెల్ తో ముంబై బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. దీంతో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 166 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇక మ్యాచ్ విష‌యానిక వ‌స్తే ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియ‌న్స్ మొద‌టి మూడు ఓవ‌ర్ల లోనే టాప్ మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జ‌ట్టు ఆ మాత్రం స్కోర్ చేసిందంటే కార‌ణం తిల‌క్ వ‌ర్మ 57 ర‌న్స్ చేయ‌గా న‌మ‌న్ ధీర్ త‌న‌కు స‌పోర్ట్ గా నిలిచాడు.

ఇక ఎప్ప‌టి లాగే ముంబై ఇండియ‌న్స్ పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచింది. ఏకంగా ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించింది. ఇక బౌల‌ర్ల విష‌యానికి వ‌స్తే ఆర్సీబీకి చెందిన భువ‌నేశ్వ‌ర్ కుమార్ సూప‌ర్ స్పెల్ వేశాడు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో దుమ్ము రేపాడు. త‌న బౌలింగ్ లో ఆడేందుకు నానా ఇబ్బందులు ప‌డ్డారు. త‌ను కేవ‌లం 4 ఓవ‌ర్లు వేసి 23 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన 4 వికెట్లు కూల్చాడు. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *