జూలు విదిల్చిన కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్

3 వికెట్ల తేడాతో పంజాబ్ పై ఢిల్లీ విక్ట‌రీ

ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్. 3 వికెట్ల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్ పై ఇంకా ఆశ‌లు పెట్టుకుంది. ఇక మ్యాచ్ విష‌యానిక వ‌స్తే అక్ష‌ర్ ప‌టేల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 210 ర‌న్స్ చేసింది. మ‌రోసారి స‌త్తా చాటాడు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్. త‌ను 36 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 59 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ప్రియాంశ్ ఆర్య 33 బాల్స్ ఆడి 56 ర‌న్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి.

అనంత‌రం భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ఆదిలోనే షాక్ త‌గిలింది. టాప్ ఆర్డ‌ర్ ఆశించిన మేర రాణించ‌లేదు. దీంతో వారు విఫ‌లం అయినా కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ బాధ్య‌తా యుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. త‌ను 30 బంతులు ఎదుర్కొని 56 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో వైపు కెప్టెన్ కు తోడయ్యాడు డేవిడ్ మిల్ల‌ర్ 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 51 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *