కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
2 BHK ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లతో పాటు వివిధ నిర్మాణ దశలలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులను ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కాలనీల నుండి 5 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారిని మాత్రమే ఎంపిక చేయాలని కీలక సూచనలు చేశారు. ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు నివసించేలా చూడాలని, అలాగే ఈ కాలనీలలో తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో గృహ స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదే సమయంలో వచ్చే జూన్ 2న రెండో దశ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు . తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇళ్లు పొందని వారికి తీపికబురు చెప్పారు. ఈ సందర్బంగా ఇళ్ల లబ్దిదారులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.





