నిప్పులు చెరిగిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో ముచ్చటించారు. ఈ సందర్బంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చెప్పులు మోసిన వాడికి సుడా ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వాడికి ఏం అర్హత ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పదవుల భర్తీపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పార్టీలో ప్రస్తుతం ఆమె తాజా కామెంట్స్ చర్చకు దారితీసేలా చేశాయి.
ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క వర్గం నేతలపై కాంగ్రెస్ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అర్హత ఉందని పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌కు ఖమ్మం సుడా ఛైర్మన్ ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ నేతలకు అవకాశాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందని ప్రశ్నించారు రేణుకా చౌదరి. హూ ఇజ్ థట్ ఫెలో పువ్వాళ్ల దుర్గాప్రసాద్? ఒక వ్యక్తికి చెప్పులు, సంచులు మోసినోడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.





