ఇచ్చిన వాగ్ధానాల‌ను అమ‌లు చేసి తీరుతాం

త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రి అధ‌వ అర్జున

చెన్నై : తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ఓ టీవీ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ఒక సంకీర్ణ ప్రభుత్వంగా తాము ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత ప్రాధాన్య‌త ఇచ్చామ‌న్నారు. తాము ప్ర‌జా పాల‌న అందిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. గత 50 ఏళ్లుగా DMK , AIADMK నెలకొల్పిన రాజకీయ ధోరణి ఇప్పుడు ఇకపై చెల్లుబాటు కాదన్నారు అధ‌వ అర్జున‌. మా మంత్రివర్గంలో IUML, VCK భాగస్వామ్యం కలిగి ఉన్నాయన్నారు. ఇది పెరియార్ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

త‌మ స‌ర్కార్ పై A. రాజా చేసిన ట్వీట్ ఖండించదగినదని పేర్కొన్నారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లప్పుడూ మహిళల హక్కుల కోసం గళం వినిపించే కనిమొళి, తన పార్టీ సభ్యులు మహిళలను గౌరవించేలా ఆదేశించాలని కోరారు. మహిళలను లక్ష్యంగా చేసుకుంటూ చేసిన వ్యాఖ్యల ద్వారా తిరుమావలవన్‌ను కించపరిచే రీతిలో చేసిన ఆ ట్వీట్ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదన‌న్నారు. నేను గవర్నర్‌తో మాట్లాడానని అన్నారు, ముఖ్యమంత్రి విజయ్ కూడా గవర్నర్‌తో మాట్లాడారు. అయితే, లోక్ భవన్‌లో అనుసరించే నిబంధనల ప్రకారం, వందేమాతరం, జాతీయ గీతానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను వారు తప్పక పాటించాలన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం

    న్యూఢిల్లీ : సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ అధ్య‌క్ష‌త‌న గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ…

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *