ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీబీఎన్ బ్రాండ్ అంబాసిడ‌ర్

స్ప‌ష్టం చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్

నంద్యాల జిల్లా : పెట్టుబ‌డుల సాధ‌న‌, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌, ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఏపీ విజ‌యానికి ముఖ్య‌మైన మూడు కార‌ణాలున్నాయని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్ర‌వారం జ‌మ్ముల మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు మేము ఎంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు రాగలం?” అని అడుగుతున్నారు. ఎందుకంటే, ఇచ్చిన మాటను చేతల్లో చూపే నాయకత్వంతో నిర్మితమైన ఆంధ్రప్రదేశ్ నేడు ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. రెండవది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌. మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను నమ్ముతాం అన్నారు.

నిర్ణయాలు వేగంగా తీసుకుని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసినప్పుడే విధానాలకు విలువ ఉంటుందన్నారు నారా లోకేష్‌. ఈ ప్రాజెక్టే అందుకు నిదర్శనం. ప్రాజెక్ట్ భూమిపూజ నుండి ప్రారంభోత్సవం వరకు రికార్డు స్థాయిలో 11 నెలల్లో పూర్తయిందన్నారు. మూడవది డ‌బుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ స‌ర్కార్‌. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానం మరింత వేగవంతమైందని అన్నారు. మాది డబుల్-ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు కేంద్ర ప్ర‌భుత్వ‌ మద్దతు తోడైన‌ప్పుడు అభివృద్ధి ప‌రుగులు పెడుతుందని చెప్పారు నారా లోకేష్‌.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *