వైఎస్ జగన్ రెడ్డి ఒక పిచ్చి తుగ్లక్ : నిమ్మ‌ల

మావిగ‌న్ అంటే జ‌నం జ‌డుసుకుంటున్నారు

అమ‌రావ‌తి : మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ రెడ్డి ఒక పిచ్చి తుగ్ల‌క్ అని ఫైర్ అయ్యారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేద‌న్నారు. ప్రజలే జంకుతున్నార‌ని పేర్కొన్నారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడ‌ని అన్నారు. హత్యా రాజ‌కీయాలు చేయ‌డం త‌న‌కు అల‌వాటుగా మారింద‌న్నారు. ఆపై త‌మ‌పై బుర‌ద జ‌ల్ల‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు నిమ్మ‌ల రామానాయుడు.

అమరావతి లో జరుగుతున్న పనులు చూసి జగన్ కి భయం మొదలైంద‌న్నారు. అందుకే అమరావతి పై జగన్ విషం కక్కుతున్నాడని మండిప‌డ్డారు. జగన్ మళ్ళీ సీఎం అయితే పొట్టేలు తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి 11 సీట్లు కుడా రావు అని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండ‌గా రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా పాలకొల్లు నుండి ట్రైన్ లో సాధారణ ప్రయాణికులతో కలసి విజయవాడ చేరుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్ తొక్కాడు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *