విద్యుత్ పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

అధికారుల‌ను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి : ఏపీలో భారీ ఎత్తున వ‌డ‌గాల్పులతో పాటు అకాల వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురియ‌డం, గాలి వాన‌ల బీభ‌త్సం సృష్టించ‌డంతో పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచి పోయింది. ఎక్క‌డిక‌క్క‌డ విద్యుత్ పోల్స్ విరిగి పోగా మ‌రికొన్ని నేల రాలాయి. చెట్లు సైతం ఇబ్బంది క‌లిగించాయి. దీంతో విద్ఉత్ వైర్లు తెగి పోయాయి. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్ లో మాట్లాడారు కీల‌క సూచ‌న‌లు చేశారు.

ఈదురుగాలులతో చెట్లు, డిస్‌ప్లే హోర్డింగ్లు విద్యుత్ స్తంభాలపై పడినట్లు వివరించారు విద్యుత్ శాఖ అధికారులు .దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు గొట్టిపాటి ర‌వికుమార్. ఎక్కడికక్కడ లైన్లు క్లియర్ చేసుకుంటూ… విద్యుత్ పునరుద్ధరణ చేపడుతామన్నాని మంత్రికి తెలిపారు. అధికారులు . కాగా ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు మంత్రి.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *