మేం చెత్త‌గా ఆడాం అందుకే ఓడి పోయాం

Spread the love

అయినా ఫైన‌ల్ కు చేరుకుంటామ‌న్న గిల్

ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన క్వాలిఫ‌య‌ర్ -1 మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓట‌మి పాలైంది గుజ‌రాత్ టైటాన్స్. 92 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కేవ‌లం 33 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. 93 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్ స్పందించాడు.

బౌలింగ్ , ఫీల్డింగ్ ప్రదర్శనపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా జట్టు ప్రదర్శనలలో ఇది అత్యంత దారుణమైన వాటిలో ఒకటి అని పేర్కొన్నారు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ రోజు తాముఇలా కుప్పకూలి పోతామని నేను అస్సలు ఊహించ లేద‌న్నాడు. మ్యాచ్ ఆరంభంలో మా చేతుల్లోనే ఉందన్నారు. కానీ ఒక అత్యంత పేలవమైన ఓవర్ తర్వాత, మ్యాచ్ ఊపు (momentum) పూర్తిగా వారి వైపు మళ్లిందన్నారు. అక్కడి నుండి ఆట స్వరూపమే పూర్తిగా మారి పోయింద‌న్నారు. ఇటువంటి కీలకమైన మ్యాచ్‌లో, మీరు ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తూ, ఇంత పేలవంగా ఫీల్డింగ్ చేస్తూ, క్యాచ్‌లను జారవిడుస్తూ ఉంటే ఇక ఎప్ప‌టికీ గెల‌వ‌లేమ‌ని అన్నారు శుభ్ మ‌న్ గిల్.

  • Related Posts

    రిష‌బ్ పంత్ కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉద్వాస‌న..?

    Spread the love

    Spread the loveత‌ప్ప‌దంటున్న జ‌ట్టు మేనేజ్మెంట్ ,జ‌ట్టు చైర్మ‌న్ ల‌క్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంత‌గా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయ‌ర్ల‌కు. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది రిష‌బ్ పంత్ గురించి. త‌ను గ‌త సీజ‌న్ తో పాటు ఈ…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో సీఎస్కేలో కీల‌క మార్పులు

    Spread the love

    Spread the loveచేయాల‌ని యోచిస్తున్న జ‌ట్టు యాజ‌మాన్యం చెన్నై : ఇండియ‌న్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్ల‌ను సాధించిన ఘ‌న‌త వ‌హించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెద‌ర‌క పోయిన‌ప్ప‌టికీ ఆశించిన మేర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *