ప్ర‌జా సంక్షేమం కూట‌మి స‌ర్కార్ ల‌క్ష్యం

Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ ప్ర‌జా సంక్షేమంపై ఎక్కువ‌గా దృష్టి సారించింద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సూప‌ర్ సిక్స్ బంప‌ర్ హిట్ అయ్యింద‌ని చెప్పారు. కూట‌మిలోని ప్ర‌ధాన పార్టీల సంయుక్త ఆధ్వ‌ర్యంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను 10న అనంత‌పురం వేదిక‌గా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలో భాగంగా పెద్ద ఎత్తున మెగా డీఎస్సీ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని, ఇప్ప‌టికే ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెట‌ర్లు కూడా ఇచ్చామ‌న్నారు సీఎం.

పేదవాడికి ఆకలి తీర్చేలా రాష్ట్రంలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింద‌న్నారు. ప్రభుత్వం రూ.5కే భోజనం అందిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకూ 5.6 కోట్ల భోజనాలు అన్నార్తుల కడుపు నింపాయన్నారు సీఎం. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య ధీమా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమ‌ని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా పేద ధనికా అనే తారతమ్యం లేకుండా 5 కోట్ల మంది ప్రజలకు వర్తింప చేస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. రూ.25 లక్షల వరకూ వైద్య చికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించామ‌న్నారు.

సంక్షేమాన్ని అభివృద్ధిని కలగలిపి పాలన చేస్తూ ఇప్పటికే సంక్షేమంపై రూ. లక్ష కోట్లకు పైగా ఖ‌ర్చు చేశామ‌న్నారు. గత పాలకులు ఐదేళ్ల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని గొప్పలు చెప్పుకుంటుంటే.. కేవలం 15 నెలల కాలంలోనే రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

    Spread the love

    Spread the loveసంకేతాలు ఇచ్చిన ట్ర‌బుల్ షూట‌ర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు మార్చే ఛాన్స్ లేక పోలేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్,…

    APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

    Spread the love

    Spread the loveఎరువుల పంపిణీపై ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఎరువు పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *