అవార్డు అందుకోలేక పోతున్నా కేటీఆర్ ఆవేద‌న

Spread the love

ముంద‌స్తు ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు ఉండ‌డంతో

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జ‌రిగే అవార్డు ప్ర‌దానోత్స‌వానికి వెళ్ల‌లేక పోతున్నారు. ఈ విష‌యాన్ని ఆ పార్టీ మంగ‌ళ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా న్యూయార్క్‌లో జరిగే ప్రతిష్టాత్మక గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. తెలంగాణలో అత్యవసర రాజకీయ కార్య‌క్ర‌మాల‌లో ఆయ‌న పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల సంబంధిత సన్నాహక సమావేశాల కారణంగా 24న బుధ‌వారం న్యూయార్క్ నగరంలో జరగనున్న గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025 వేడుకకు హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు కేటీఆర్.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతగా ఎంపికైన ఆయ‌న ఇలా అన్నారు. UN జనరల్ అసెంబ్లీతో పాటు క్లైమేట్ వీక్‌లో భాగంగా నిర్వహించబడిన 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025కి ఎంపిక కావడం నిజంగా ఆనందంగా ఉంద‌న్నారు. . ఈ గుర్తింపు మాజీ CM KCR , BRS ప్రభుత్వం నాయకత్వంలో తెలంగాణ ప్రతిష్టాత్మకమైన హరిత ప్రయాణానికి దక్కిన గౌర‌వంగా తాను భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. మునుపటి కమిట్‌మెంట్‌ల కారణంగా న్యూయార్క్‌లో జరిగే అవార్డు ప్రదానోత్సవానికి తాను హాజరు కాలేక పోతున్నందుకు బాధ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. పచ్చని వాతావరణానికి అనుకూలంగా ఉండే తెలంగాణను నిర్మించడానికి BRS ప్రభుత్వం చేస్తున్న సమిష్టి ప్రయత్నాలకు ఈ గౌరవాన్ని నిదర్శనంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.

  • Related Posts

    రాష్ట్రాభివృద్దికి సింగ‌పూర్ సాంకేతిక సాయం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు సింగ‌పూర్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్దికి సింగ‌పూర్ దేశం అనుస‌రిస్తున్న సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామ‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, మత్స్య శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. మంత్రి పొంగూరు నారాయ‌ణ‌తో…

    వైసీపీ మనుగడ మొత్తం విధ్వంస‌మే

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థ‌సార‌థి అమ‌రావ‌తి : వైసీపీ పాల‌నా కాలంలో మొత్తం విధ్వంసం త‌ప్ప జ‌రిగింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. నాడు వివేకా నేడు దస్తగిరి వైసీపీ ‘రక్త చరిత్ర’ కాదా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *