ఆధునిక సాంకేతిక శిక్షణకు ముందడుగు

Spread the love

నైలెట్ ప్రారంభోత్స‌వంలో ఎంపీ గురుమూర్తి

తిరుప‌తి : తిరుపతిలో నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ “నైలెట్” కేంద్రం శుక్ర‌వారం ప్రారంభమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ప్రస్తుతం వేంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రాంగణంలో తాత్కాలిక భవనంలో దీనిని ఏర్పాటు చేశారు. నైలెట్ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక ఐటీ టెక్నాలజీతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ కేంద్రం స్థాపన కోసం ఎంపీ గురుమూర్తి నిరంతరం కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

నైలెట్ ఆవిర్భావం తిరుపతిలో సాంకేతిక శిక్షణకు కొత్త మలుపని ఎంపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. నైలెట్‌లో ఐటీ సంబంధిత శిక్షణతో పాటు వెబ్ డిజైనింగ్, పీసీ హార్డ్‌వేర్ , నెట్‌వర్కింగ్, ఆఫీస్ ఆటోమేషన్, అకౌంటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి షార్ట్‌టర్మ్ కోర్సులు అందించనున్నారని చెప్పారు. అదనంగా, ఎంబీడెడ్ సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సెమికండక్టర్ డిజైన్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ శిక్షణ లభించనుంద‌ని చెప్పారు ఎంపీ గురుమూర్తి. నైలెట్ కేంద్రం వల్ల తిరుపతి యువతకు దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Related Posts

    ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు రు. 2711.79 కోట్లు

    Spread the love

    Spread the loveవిడుద‌ల చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.…

    గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని బంధం

    Spread the love

    Spread the loveఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌న‌కు గంగ‌పుత్రుల కుటుంబాల‌తో విడ‌దీయ‌లేని అనుబంధం ఉంద‌న్నారు హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. త‌న నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను మంజూరు చేయించామని, త్వరలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *