రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష

Spread the love

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌పై కీల‌క సూచ‌న‌లు చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ చలానా సిస్టమ్ తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు నిర్వహణ అంశాలపై రోడ్ సేఫ్టీ ఏడీజీ శ్రీ కృపానంద త్రిపాఠి , రోడ్ సేఫ్టీ డీఐజీ విజయరావు , ఐపీఎస్ మల్లికా గార్గ్ , ఇతర అధికారులతో చర్చించారు హోం మంత్రి. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి తగిన ఆదేశాల ఇవ్వడం జరిగింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వంగ‌ల‌పూడి అనిత సూచించారు. ప్ర‌తి నిత్యం వేలాది మంది ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణం చేస్తుంటార‌ని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టాల‌ని అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల కొంత‌లో కొంతైనా ప్ర‌మాదాల బారి నుండి కాపాడుకునేందుకు వీలు క‌లుగుతుంద‌న్నారు.

  • Related Posts

    బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

    Spread the love

    Spread the loveతెలంగాణ‌పై అడుగ‌డుగునా అవమానం హైద‌రాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేద‌న్నారు.…

    కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

    Spread the love

    Spread the loveమంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్ విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *