భార‌త్ సెన్సేష‌న్ ఆస్ట్రేలియా ప‌రేష‌న్

Spread the love

మ‌హిళా క్రికెట‌ర్లు అదుర్స్..ఛాంపియన్ కు షాక్

ముంబై : క‌ళ్ల ముందున్న భారీ ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించారు భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు. ఇండియాలో జ‌రుగుతున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ కీల‌క మ్యాచ్ లో స‌త్తా చాటారు. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటారు. ఆదివారం జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నున్నారు. ఇందు కోసం అన్ని శ‌క్తులు సిద్దం చేసుకున్నారు. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా సెమీస్ మ్యాచ్ జ‌రిగింది. ఏడుసార్లు ఛాంపియ‌న్ అయిన బ‌ల‌మైన ఆస్ట్రేలియా జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 49.5 ఓవ‌ర్ల‌లో ఏకంగా 338 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇదే అత్య‌ధిక స్కోర్. ఇక అంద‌రూ ఇండియా ఓడి పోతుంద‌ని భావించారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఎక్క‌డా త‌ల వంచ లేదు. ఓ వైపు వికెట్లు రాలి పోతున్నా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ఆడారు అమ్మ‌యిలు.

జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ మ‌రోసారి బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడింది. త‌ను 88 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 2 భారీ సిక్స్ ల‌తో 89 ర‌న్స్ చేసింది. ఇక జెమీమా రోడ్రిగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. త‌ను మ్యాచ్ చివ‌రి దాకా నిలిచింది. అజేయ సెంచ‌రీతో క‌దం తొక్కింది. కేవ‌లం 134 బంతులు ఎదుర్కొన్న జెమీమా 14 ఫోర్ల‌తో 127 ర‌న్స్ చేసింది. దీంతో భార‌త జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 48.3 ఓవ‌ర్ల‌లోనే ఇంకా 9 బంతులు మిగిలి ఉండ‌గానే జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా జ‌ట్టును ఓడించింది. ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు ద‌ర్జాగా దూసుకు వెళ్లింది. యావ‌త్ భార‌త దేశం జెమీమాకు స‌లాం చేస్తోంది.

  • Related Posts

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో…

    డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

    Spread the love

    Spread the love60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *